ఘనంగా‘ఆస్కార్’ అవార్డుల ప్రదానోత్సవం

ప్రపంచంలో అతి పెద్ద సినీ పండుగ 92వ ‘ఆస్కార్’ అవార్డుల వేడుక ఘనంగా లాస్ఏంజల్స్ లోని  డాల్బీ థియేటర్ లో ప్రారంభమైంది. హాలీవుడ్‌ తారలతో పాటు పలు దేశాలకి చెందిన నటీనటుల సమక్షంలో ఈ వేడక అంగరంగ వైభవంగా జరుగుతుంది. లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరుగుతున్న ఈ వేడుకలో నటీమణులు రెడ్‌ కార్పెట్‌పై హోయలు పోతున్నారు. ప్రపంచంలోని తారలందరు ఒకే చోట చేరడంతో ఆ ప్రాంగణం శోభాయమానంగా మారింది.

92వ ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమంలో పలు విభాగాలకి సంబంధించి అవార్డులని ప్రధానం చేస్తున్నారు. . ఉత్తమ యానిమేటేడ్‌ షార్ట్‌ ఫిలింగా హెయిర్‌ లవ్‌ చిత్రానికి ఆస్కార్‌ అవార్డ్‌ దక్కగా,  ఉత్తమ సహాయ నటుడిగా బ్రాడ్‌పిట్‌ ( వన్స్ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌), బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిలింగా టాయ్‌ స్టోరీ చిత్రాలు అవార్డులని దక్కించుకున్నాయి. కాగా, ఆస్కార్ కిరీటం అందుకునేందుకు మొత్తం తొమ్మిది చిత్రాలు బ‌రిలో నిలిచాయి. వాటిలో జోక‌ర్, పారాసైట్‌, 1917, మ్యారేజ్ స్టోరీ, ది ఐరిష్ మ్యాన్, జోజో రాబిట్‌, లిటిల్ ఉమెన్‌, ఫోర్డ్ వర్సెస్‌  ఫెరారి, ఒన్స్  ఎపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ చిత్రాలు ఉన్నాయి.

*ఉత్తమ చిత్రంగా పారా సైట్‌

 

*ఉత్తమ నటుడిగా జాక్విన్ ఫోనిక్స్(జోకర్)

*ఉత్తమ నటిగా రెనీ జెల్వెగర్ (జూడీ)

*ఉత్తమ దర్శకుడు: పారాసైట్‌ ( బోన్‌ జోన్‌ హో)

*ఉత్తమ సంగీతం : జోకర్‌ ( హిల్దార్‌)

*మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌ : బాంబ్‌ షెల్‌

*ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: పారాసైట్‌

*ఉత్తమ విజువల్ ఎఫెక్ట్‌: 1917 ( రోచ్‌రాన్‌, గ్రెగ్‌ బట్లర్‌, డోమినిక్‌ తువే)

*ఉత్తమ ఫిల్మ్‌ ఎడిటింగ్‌: ఫోర్డ్‌ వర్సెస్‌ ఫెరారీ ( మైఖేల్‌ మెక్‌సుకర్‌, అండ్రూ బక్‌ల్యాండ్‌)

*ఉత్తమ సినిమాటోగ్రఫీ: 1917(రోజర్‌ డికెన్స్‌)

*ఉత్తమ సౌండ్‌ ఎడిటింగ్‌: ఫోర్డ్‌ వర్సెస్‌ ఫెరారీ (డొనాల్డ్‌ సిల్వెస్టర్‌)

*ఉత్తమ సౌండ్‌ మిక్సింగ్‌: 1917 ( మార్క్‌ టేలర్‌, స్టువర్ట్‌ విల్సన్‌)

*ఉత్తమ సహాయనటి: లారా డెర్న్‌ ( మ్యారేజ్‌ స్టోరీ)

*ఉత్తమ సహాయనటుడిగా బ్రాడ్‌పిట్‌ (వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌)

*ఉత్తమ యానిమేషన్‌ చిత్రం: టాయ్‌ స్టోరీ 4

*ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే: బాంగ్‌ జూన్ హో (పారాసైట్‌)

*ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ఫిల్మ్‌ – హెయిర్‌ లవ్‌

*ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే: తైకా వెయిటిటి (జోజో ర్యాబిట్‌)

*ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్ ఫిల్మ్‌: ది నేబర్స్‌ విండో

*ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: ” వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌

*ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌ – లిటిల్‌ ఉమెన్‌

*ఉత్తమ డాక్కుమెంటరీ (ఫీచర్‌): అమెరికన్‌ ఫ్యాక్టరీ