గుజరాత్‌ లో ట్రంప్‌ రాకకు భారీ ఏర్పాట్లు

భారత్‌ పర్యటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.  ఫేస్‌ బుక్‌ రారాజులం మళ్లీ కలవబోతున్నామంటూ మోడీని ఉద్దేశించి ట్వీట్‌ చేశారాయన.  ఈ నెల 24న భారత్‌ రానున్న ట్రంప్‌ గుజరాత్‌ లో పర్యటించనున్నారు. ట్రంప్‌ రాక కోసం అహ్మదాబాద్‌ లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఎయిర్‌ పోర్టు నుంచి సబర్మతి ఆశ్రమం వరకు 22కి.మీ మేర జరగనున్న రోడ్‌ షో కోసం నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసినట్టు తెలిపారు అహ్మదాబాద్ మేయర్ బిజాల్ పటేల్. దారిపొడువునా నేతలకు జనం గ్రీటింగ్స్ తెలుపుతారని.. 300 సంస్థలు, పలు ఎన్జీవోల ప్రతినిధులు పాల్గొంటారని వివరించారు. ఇక లక్షమంది వరకూ కూర్చునేందుకు వీలున్న అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో ప్రజలను ఉద్ధేశించి ట్రంప్, మోడీలు మాట్లాడుతారంటున్నారు.