గుజరాత్‌ పోలీసులు నా భర్తను వేధిస్తున్నారు- కింజల్‌ పటేల్‌

పటేల్‌ ఉద్యమ నేత హార్ధిక్‌ పటేల్‌ గత 20 రోజులుగా కనిపించడం లేదని ఆయన భార్య కింజల్‌ పటేల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్‌ పోలీసులు తన భర్తను వేధిస్తున్నారు అని, తన ఆచూకీ గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని ఆమె ఇంటర్‌ నెట్‌లో ఓ వీడియోను షేర్‌ చేశారు. 2017లో పటేళ్లపై ఉన్న అన్ని కేసులను ఉపసంహరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, మరి అలాంటప్పుడు హార్ధిక్‌ పటేల్‌ ఒక్కడినే ఎందుకు లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. బీజేపీలో చేరిన మరో ఇద్దరు పటేల్‌ నేతల పట్ల ఎందుకు ఉదారంగా వ్యవహరిస్తున్నారని నిలదీశారు. హార్థిక్‌ పటేల్‌ ప్రజలను కలుసుకుని, వారి సమస్యలను ప్రస్తావించడం ప్రభుత్వానికి ఇష్టం లేదని అన్నారు.