గుజరాత్‌లోఘోర రోడ్డు ప్రమాదం,12 మంది మృతి

గుజరాత్‌లోని వడోదర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గడిచిన రాత్రి మహువద్‌ గ్రామ సమీపంలో ట్రక్కు, టెంపో వాహనం ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 12 మంది మృతిచెందారు. మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. బాధితులను వడోదరలోని ఎస్‌ఎస్‌జీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సుధీర్‌ దేశాయ్‌ తెలిపారు.