కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వ టీచర్లు

ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. రేపు మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. అదేవిధంగా ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లను ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ విద్యాశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిని చూసిన విపక్షాలు కేజ్రీవాల్‌పై మండిపడుతున్నాయి. కేజ్రీవాల్ ప్రభుత్వం తన స్వప్రయోజనాలకు ప్రభుత్వవిద్యా వ్యవస్థను వాడుకుంటున్నదని ఆరోపిస్తున్నారు. న్యూఢిల్లీ