కేంద్రం వైఫల్యంతోనే ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు

ఢిల్లీలో జరిగిన అల్లర్లపై తమిళసూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. కేంద్రప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుపట్టారు. ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు ముమ్మాటికి కేంద్రప్రభుత్వం నిఘా వైఫల్యమేనని ఆరోపించారు. కేంద్రం తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని రజనీకాంత్‌ అన్నారు. ఇక పౌరసత్వ సవరణ చట్టంతో ముస్లింలకు నష్టం కలిగితే..గతంలో చెప్పినట్లుగానే తాను వారి వెంటనే ఉంటానని రజనీకాంత్ స్పష్టం చేశారు. ఢిల్లీ అల్లర్లలో బాధితులైనవారికి తక్షణమే సాయం చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. బీజేపీ నాయకత్వం ఇప్పటికైనా మతపరమైన అంశాలను సున్నితంగా పరిష్కరించాలని రజనీకాంత్‌ సూచించారు.