పెళ్లిపత్రికల్లో మత్తు మందు…!!

బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో భారీమొత్తంలో మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. పెళ్లిపత్రికల్లో రహస్యంగా తరలిస్తున్న ఐదు కోట్ల విలువైన ఎఫెడ్రిన్‌ అనే మత్తు మందును సీజ్‌ చేశారు. శనివారం 5.49 కేజీల డ్రగ్స్‌ను పెళ్లిపత్రికల్లో గుట్టుగా అమర్చి తరలిస్తుండగా కార్గో విభాగంలో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. మదురైకి చెందిన వ్యక్తి డ్రగ్స్‌ దాచిన 43 శుభలేఖలను ఆస్ట్రేలియాకు తరలిస్తున్నాడు. కస్టమ్స్‌ అధికారులకు అనుమానం వచ్చి తనిఖీ చేయగా పత్రికల మధ్య అమర్చిన ఎఫెడ్రిన్‌ ప్యాకెట్లు బయటపడ్డాయి.