కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చాలా గొప్పది

రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టడం సంతోషకరమన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. మిషన్ కాకతీయ పథకం ద్వార చెరువులకు తెలంగాణ ప్రభుత్వం చెరువుకుల పూర్వ వైభవం తీసుకొచ్చిందన్నారు.  అలాగే  కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చాలా గొప్పదన్నారు.  అటు సమయానుకూలంగా వ్యవసాయంలో వస్తున్న మార్పులను ఉపయోగించుకోవాలని రైతులకు వెంకయ్యనాయుడు సూచించారు. రైతులకు ప్రభుత్వం తరపున  సకాలంలో విత్తనాలు, కల్తీలేని మందులు అందిచాలని కోరారు. రాజేంద్రనగర్  జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన అగ్రి విజన్ 2020 సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.