కాగజ్ నగర్ పేపర్ మిల్లులో ప్రమాదం, ముగ్గురు కూలీలు మృతి

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా  కాగజ్నగర్ లోని సిర్పూర్ పేపర్ మిల్లులో భారీ ప్రమాదం జరిగింది.  బాయిలర్ కోసం తవ్విన గుంతలో మట్టి కుప్పలు కూలడంతో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రంగనాథ్, చోటు బనియ, రంజిత్ అనే ముగ్గురు కూలీలు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని హైద్రాబాద్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.