కరోనా కట్టడికి ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సిన్లు

ప్రపంచదేశాలను కరోనా వైరస్‌ వణికిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు మందుల తయారీలో మునిగిపోయారు సైంటిస్టులు. అయితే వైరస్‌ ను కంట్రోల్‌ చేసేందుకు  ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సిన్లు ఇవ్వడం మంచిదంటున్నారు ప్రముఖ శాస్త్రవేత్త, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పీటర్‌ పియోట్‌.  వ్యాక్సిన్‌ తీసుకున్నప్పుడు వైరస్‌ లు దాడి చేసినా అంతగా ప్రభావం చూపలేవంటున్నారు. కొవిడ్‌-19  వ్యాపిస్తే నియంత్రించే యంత్రాంగాలు ఇంకా చాలా దేశాల్లో లేవంటున్న పీటర్‌.. కరోనా కట్టడికి మాస్కుల తయారీపైనా దృష్టిసారించాలన్నారు.అయితే  కొవిడ్‌ వైరస్‌ లక్షణాలు అందరిలో ఉంటాయని చెప్పలేమని.. కొందరిలో లక్షణాలు లేకున్నా వైరస్‌ ప్రబలే అవకాశం ఉందన్నారు.