కట్- కాపీ- పేస్ట్ సృష్టికర్త లారీ టెస్లర్ మృతి

కట్- కాపీ- పేస్ట్ సృష్టికర్త లారీ టెస్లర్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 74ఏళ్ల టెస్లర్‌ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. న్యూయార్క్‌లో జన్మించిన ఆయన స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ చదివి.. 1973లో జెరాక్స్ పాలో ఆల్టో రీసెర్చ్ సెంటర్‌లో చేరారు. అక్కడే టిమ్‌ మాట్‌ సాయంతో జిప్సీ టెక్స్ట్ ఎడిటర్ తయారు చేశారు. దీనిని మరింతగా అభివృద్ధి పరచి కట్- కాపీ- పేస్ట్ ను రూపొందించారు. లారీ టెస్లర్‌ అమెజాన్, యూహూ తదితర ప్రముఖ సంస్థల్లోనూ పనిచేశారు. అయితే టెస్లర్‌ కు పర్సనల్ కంప్యూటర్ విప్లవకర్త అయిన స్టీవ్ జాబ్స్‌కు దక్కినంత ఆదరణ దక్కలేదు.