ఒలింపిక్స్‌ కు కరోనా ముప్పు ఉందా..?

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ ప్రభావం టోక్యో ఒలింపిక్స్‌ పై ఉంటుందని ఇప్పుడే చెప్పడం.. తొందరపాటు అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఒలింపిక్స్‌ నిర్వహణకు సంబంధించి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదని యూఎన్‌ ఏజెన్సీ ఎమెర్జెన్సీ ప్రోగ్రామ్‌ మైకేల్‌ తెలిపారు.  డబ్ల్యూహెచ్‌వో ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఒలింపిక్స్‌ నిర్వహణపై  ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదన్నారు. అయితే కరోనా ముప్పును అంచనా వేయడంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి సహకరిస్తామన్నారు. అటు కరోనా ప్రభావం గురించి   అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీతో డబ్ల్యూహెచ్‌వో సంప్రదింపులు జరుపుతోంది. షెడ్యూల్ ప్రకారం జపాన్‌లోని టోక్యో నగరంలో జులై 24న ఒలింపిక్స్, ఆగస్టు 25న పారాలింపిక్స్‌ ప్రారంభం కానున్నాయి.