ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులున్నాయా? అయితే జాగ్రత్త!

ఒక వ్యక్తి ఒకే పాన్‌ కార్డును కలిగి ఉండాలనే నిబంధనను అతిక్రమించిన వ్యక్తులపై ఆదాయపు పన్ను శాఖ చర్యలను తీసుకోనుంది. ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులను కలిగిన వారికి 10 వేల రూపాయల జరిమానా విధించాలని ఆ శాఖ నిర్ణయించింది. అయితే వివిధ కారణాల వలన ఒకటి కన్నా ఎక్కువ పాన్‌కార్డులను కలిగి ఉన్నవారు…తమ వద్ద అదనంగా ఉన్న పాన్‌కార్డులను స్వాధీనం చేయటం ద్వారా ఇబ్బందుల నుంచి తప్పించుకునే అవకాశాన్ని ఆదాయపుపన్ను శాఖ కలిగించింది. వారు తమ దగ్గరున్న కార్డులను ప్రభుత్వానికి వెంటనే సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది.