ఎవరైనా రావొచ్చు.. నాతో మాట్లాడొచ్చు

అటు కాంగ్రెస్‌ పార్టీయే ఈ దేశాన్ని మత ప్రాతిపదికన విభజించిందని అమిత్‌ షా ఆరోపించారు. సీఏఏ సంబంధిత అంశాలపై ఎవరైనా తనతో మాట్లాడాలనుకుంటే తన కార్యాలయం దగ్గర సమయం తీసుకోవచ్చన్నారు. వారికి మూడు రోజుల్లో సమయం కేటాయిస్తామని తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతిఒక్కరికీ ఉంటుందన్నారు. జమ్మూకశ్మీర్‌లోని నేతల నిర్బంధంపై నిర్ణయం స్థానిక అధికార యంత్రాంగానిదే తప్ప అందులో కేంద్రం పాత్ర లేదన్నారు. ఎన్‌పీఆర్‌ అప్‌డేట్‌ ప్రక్రియకు ఏ పత్రాలూ చూపించాల్సిన అవసరం లేదని అమిత్‌ షా స్పష్టంచేశారు.