ఇవాళ నిర్భయ దోషుల శిక్షపై సుప్రీంకోర్టులో విచారణ 

నిర్భయ దోషులకు వేర్వేరు మరణశిక్ష అమలు పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ విషయంపై మధ్యాహ్నంలోగా దోషులు తమ అభిప్రాయాలను తెలపాలని సూచించింది. అదే సమయంలో దోషులకు నూతన డెత్​ వారెంట్లను జారీ చేయాలన్న పిటిషన్లపై విచారణను సోమవారానికి వాయిదా వేసింది ఢిల్లీ కోర్టు. దోషుల్లో ఒకడైన పవన్ గుప్తాకు న్యాయవాదిని నియమించింది. అతని వైపు నుంచి న్యాయ ప్రక్రియ ఆలస్యమవుతోందని అసహనం వ్యక్తం చేసింది. దోషుల్లో ఒకడైన వినయ్​ శర్మ.. రాష్ట్రపతి ఉద్దేశ్యపూర్వకంగా తన క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చారంటూ దాఖలు చేసిన పిటిషన్‌ పై కూడా తీర్పును వెల్లడించనుంది సుప్రీం.