అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 23 నుంచి ప్రారంభం

అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 23న ప్రారంభం కాబోతుంది.  దక్షిణ కశ్మీరులోని హిమాలయాల్లో ఉన్న అమర్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించుకోవడానికి 42 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని అధికారులు ప్రకటించారు. ఆగస్టు 3న ముగుస్తుంది. అమర్‌నాథ్‌ యాత్ర కోసం రిజిస్ట్రేషన్లు ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమవుతాయి. 13 కన్నా తక్కువ, 75 కన్నా ఎక్కువ వయసున్న వారిని యాత్రకు అనుమతించరు. గతేడాది అమర్‌నాథ్‌ యాత్ర 40 రోజులు మాత్రమే కొనసాగింది.