దేశం ప్రస్తుతం సంక్షోభంలో ఉంది :మాజీ క్రికెటర్ గవాస్కర్

దేశంలో తాజా పరిస్థితులపై క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ స్పందించారు. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్న గవాస్కర్.. తరగతి గదుల్లో ఉండాల్సిన విద్యార్థులు రోడ్లపైన కనిపిస్తుంటే… ఇదే కారణంగా కొందరు ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తోందన్నారు. దేశంలో ప్రతీ ఒక్కరూ.. ముందుగా భారతీయులమనే భావనతో సంఘటితంగా పని చేస్తే ఒకే జాతిగా ముందుగా వెళ్లగలమన్నారు. 1965లో కూడా ఇలాంటి సంక్షోభమే వస్తే దానిని సమర్థంగా ఎదుర్కోగలిగామన్న గవాస్కర్.. విద్యార్థులు బాధ్యతతో చదువుకోవాలని హితవు పలికారు.