జాతరకు వచ్చిన అందరికీ మొక్కల పంపిణీ…!

హరిత తెలంగాణ కోసం ఓ పర్యావరణ ప్రేమికుడు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాడు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి జాతర సందర్భంగా మొక్కల పంపిణీకి శ్రీకారం చుట్టారు. వేలేరు మండలం కన్నారం గ్రామానికి చెందిన సురేందర్ రెడ్డి ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. వృక్షప్రసాదం పేరిట బ్రహోత్సవాలకు హాజరయ్యే భక్తులందరికీ.. ఒక్కో మొక్కను అందించనున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య చేతుల మీదుగా ఈ వృక్షప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. కాగా.. ఈ కార్యక్రమంలో జామ, మామిడి, తులసి నిమ్మ మొక్కలను సురేందర్ రెడ్డి సొంత ఖర్చులతో అందిస్తుండగా… ఆయన హరితస్ఫూర్తిని అందరూ అభినందిస్తున్నారు.