ఆసిస్‌ వన్డే సిరీస్‌లో సత్తా చాటుతాం :కోహ్లీ

ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్ లో సత్తా చాటుతామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. మంగళవారం నుంచి ఆస్ట్రేలియాతో సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో… కోహ్లీ ముంబైలో మీడియాతో మాట్లాడారు. వరుస విజయాలతో జోరుమీదున్న ఆస్ట్రేలియాను తమ జట్టు కట్టడి చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆసీస్ ఆటగాళ్లను తాము తక్కువ అంచనా వేయడంలేదన్న కోహ్లీ.. వారి కోసం ప్రత్యేక వ్యూహాలతో తమ భారత్ టీం రెడీగా ఉందన్నారు. ఇక… డే అండ్ నైట్ టెస్టులతో కొత్త అనుభూతి కలుగుతోందని కోహ్లీ తెలిపాడు.