కారు ప్రమాదంలో ఇద్దరు మృతి…

పండగ వేళ ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పెనుబల్లి మండలం, లంకపల్లి వద్ద ఓ కారు అదుపుతప్పిన డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో… ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు రాజమండ్రికి చెందిన హేమంత్‌ రెడ్డి, సూరి రెడ్డిగా పోలీసులు గుర్తించారు. కర్ణాటక నుంచి రాజమండ్రి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు.