బస్సు-బైక్ ఢీ, ఇద్దరు మృతి…

హైదరాబాద్‌ శివారులో రాజీవ్ రహాదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. హకీంపేట-తూంకుంట మధ్యలో గల టర్నింగ్ వద్ద.. వేగంగా వచ్చిన బైక్, ఎదురుగా వస్తున్న జగిత్యాలకు చెందిన పూజిత ట్రావెల్స్‌ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు జగదీష్‌, శిరీష్‌లు… తూముకుంటలోని తమ బంధువుల ఇంట్లో జరిగిన బర్త్‌డే పార్టీకి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసుల వెల్లడించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.