బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌పై కేసు…

పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌పై కేసు నమోదైంది. సీఏఏను వ్యతిరేకిస్తున్న నిరసన కారులను కుక్కలను కాల్చినట్లు కాల్చిపారేయాలంటూ… ఆదివారం ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టీఎంసీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. మా ప్రభుత్వాలు ఉన్న ఉత్తర ప్రదేశ్, అస్సాం, కర్ణాటకలలో సీఏఏను వ్యతిరేకిస్తున్న వాళ్లను కుక్కలను కాల్చినట్లు కాలుస్తున్నారు, మిగతా రాష్ట్రాల్లో కూడా సీఏఏ నిరసన కారులను అలాగే కాల్చి చంపాలంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. దిలీప్ ఘోష్ వ్యాఖ్యలపై టీఎంసీ నేత కృష్ణేందు బెనర్జీ రాణాఘాట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.