వచ్చే నెల 13న విచారణకు రానున్న పిటిషన్లు

శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లు ఈ నెల 13న సుప్రీంకోర్టులో విచారణకు రానున్నాయి.తొమ్మిది మంది సభ్యులతో కూడిన విస్తృత ధర్మాసనం ఈ కేసులో వాదనలు విననుంది. శబరిమల అంశంతో పాటు ముస్లిం, పార్శీ మహిళలు ఎదుర్కొంటున్న వివక్షపై కూడా ధర్మాసనం విచారణ చేపట్టనుంది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతినిస్తూ 2018లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ 65 రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా, ఈ తీర్పును పునఃపరిశీలించాలంటూ ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ పిల్ దాఖలు చేసింది