రామ‌సేతుపై 3 నెల‌ల త‌ర్వాత విచార‌ణ :సుప్రీంకోర్టు

రామ‌సేతును జాతీయ వార‌స‌త్వ సంప‌ద‌గా గుర్తించాల‌ని బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి వేసిన పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ అంశాన్ని మ‌రో మూడు నెల‌ల త‌ర్వాత విచార‌ణ‌కు స్వీక‌రించ‌నున్నట్లు అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సీజేఐ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. అటు 2017లో ఇదే అంశంపై కేంద్రం స‌మావేశం నిర్వహించిందని తెలిపారు. రామ‌సేత‌ను జాతీయ వార‌స‌త్వ సంప‌ద‌గా గుర్తించాల‌ని అప్పుడు అంగీక‌రించార‌ని చెప్పారు. వివాదాస్పద సేతుస‌ముద్రం షిప్ కెనాల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తాను పిల్ వేసిన విషయాన్ని సుబ్రమణ్య స్వామి గుర్తు చేశారు. భారత్-శ్రీలంక మ‌ధ్య ఉన్న స‌ముద్రంలో రామ‌సేతు మార్గం ఉన్నది. లంక‌లో ఉన్న సీత‌ను కాపాడేందుకు వాన‌రులు రామ‌సేతును నిర్మించిన‌ట్లు రామాయ‌ణం చెప్తోంది.