గాంధీజీ సేవలను తక్కువ చేసి చూడడం తగదు :సుప్రీకోర్టు

భారత రత్న బిరుదు కన్నా.. మహాత్మాగాంధీ ఎంతో ఉన్నతుడని మరోసారి స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఆయన్ను ప్రజలు జాతిపితగా ఎంతో ఉన్నతంగా చూస్తారని, గాంధీజికి ఉన్న గుర్తింపు అనన్యమైందని తెలిపింది. మహాత్మా గాంధీకి భారతరత్న అవార్డు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తేవాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మహాత్మా గాంధీకి భారతరత్న ఇవ్వడం అంటే ఆయన్ను, ఆయన చేసిన సేవలను తక్కువ చేసి చూడడం అవుతుందని అభిప్రాయపడింది. అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. గతంలోనూ గాంధీజీకి భారతరత్న ఇవ్వాలన్న పటిషన్లను కోర్టు తిరస్కరించింది. గాంధీజీ సేవలను తక్కవు చేసి చూడడడం తగదని పిటీషనర్లకు చురకలంటించింది.