లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతుండడంతో మార్కెట్లు ట్రేడింగ్ ఆరంభం నుంచే పుంజుకున్నాయి. సెన్సెక్స్ 260 పాయింట్ల లాభంతో 41860 వద్ద ముగిసింది. నిఫ్టీ 73 పాయింట్ల లాభంతో 12330 వద్ద ముగిసింది. త్రైమాసిక ఫలితాల ప్రభావంతో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ షేరు ధర ట్రేడింగ్ ముగిసే సమయానికి 4శాతం పైగా లాభానికి చేరుకుంది. ఎన్ఎస్ఈలో ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంకు, కోల్ ఇండియా, గెయిల్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో పయనించాయి.