క్రికెటర్‌గా కంటే అధ్యక్షుడిగానే ఈజీ :గంగూలీ

బీసీసీఐ అధ్యక్షుడిగా కంటే క్రికెటర్‌గా బాధ్యతలు నిర్వర్తించడమే కష్టమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ తెలిపాడు. స్పోర్ట్స్‌ స్టార్‌ ఏసెస్‌ అవార్డుల కార్యక్రమంలో దాదా పాల్గొన్నాడు. 2019 ఉత్తమ టెస్టు జట్టుగా భారత్‌ ఎంపికవ్వడంతో… టీమిండియా తరఫున ట్రోఫీని అందుకున్నాడు. టీమిండియాకు ఉత్తమ టెస్టు జట్టు అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాల తెలిన గంగూలీ.. ఈ ఏడాది మిగిలిన జట్లు కూడా గొప్పగానే ఆడాయని అన్నాడు. భారత జట్టుకు, బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌కు అభినందనలు తెలిపిన ఆయన… ఈ కొత్త ఏడాదికి కూడా ఆల్‌ ది బెస్ట్ చెప్పాడు.