శబరిమలలో మకరజ్యోతి దర్శనం…

శబరిమలలో మకరజ్యోతి దర్శనం కన్నుల పండువగా జరిగింది. పొన్నాంబళంమేడు కొండల్లో బుధవారం సాయంత్రం మకర జ్యోతి దర్శనంతో… శబరి గిరులు అయ్యప్ప శరణుఘెషతో మార్మోగాయి. స్వామియే శరణం అయ్యప్ప అంటూ శబరిమల సన్నిధానం మారుమోగింది. అప్పటికే శబరికి చేరుకున్న భక్తులు జ్యోతిని చూసి ఆనంద పరవశులయ్యారు. స్వామి కోసం పందళ రాజ వంశీకులు తీసుకువచ్చిన ప్రత్యేక ఆభరణాలను అయ్యప్ప స్వామికి అలంకరించారు. ఆ తర్వాత సాయంత్రం 6.50 గంటల సమయంలో పొన్నాంబలమేడు కొండపై జ్యోతి రూపంలో దర్శనం ఇచ్చింది. మకరజ్యోతి దర్శనం కోసం భక్తులు శబరిమల సన్నిధానం నుంచి పంబ వరకు బారులు తీరారు. కేరళతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు జ్యోతి దర్శనానికి వచ్చారు. పంబ, నీలికల్‌, పులిమేడ్‌ ప్రాంతాలను జ్యోతిని వీక్షించేందుకు ట్రావెన్స్‌కోర్‌ దేవస్థానం ఏర్పాట్లు చేసింది. మరోవైపు పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టారు. కాగా… సంక్రాంతి సందర్భంగా శబరిమలకు అయ్యప్ప దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మరో ఐదు రోజుల పాటు అయ్యప్పను దర్శించుకోనున్నారు.