మోదీతో రష్యా విదేశాంగ మంత్రి భేటీ…

రష్యా విదేశాంగ మంత్రి సెర్జే లావ్రోవ్ భారత్‌లో పర్యటిస్తున్నారు. భారత పర్యటనలో భాగంగా బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరుదేశాలకు సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోదీ, రష్యా మంత్రి సెర్జే లావ్రోవ్ తో చర్చించారు. సెర్జే లావ్రోవ్ భారత పర్యటనలో భాగంగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రమణ్యం జయశంకర్ ను కలవనున్నారు. రైసినా-2020 సదస్సులో పాల్గొననున్నారు.