రైసినా-2020: ప్రారంభించిన ప్రధాని మోదీ…

రైసినా వార్షిక సదస్సులు.. రైసినా 2020 కార్యక్రమాన్ని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. విదేశాంగ శాఖ, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జయశంకర్, తదితరులు పాల్గొన్నారు. జనవరి 14 నుంచి 16 వరకు రెండు రోజులపాటు జరుగనున్న ఈ కార్యక్రమంలో… 100 దేశాలకు చెందిన దాదాపు 700 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. అలాగే.. రష్యా, ఇరాన్, ఆస్ట్రేలియా, మాల్దీవులు, సౌతాఫ్రికా, ఎస్టోనియా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, హంగేరి, లాట్వియా, ఉజ్బెకిస్తాన్‌, యురేపియన్‌ యూనియన్‌తో పాటు అమెరికా, ఆఫ్ఘనిస్తాన్‌ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, దేశాల విదేశాంగ శాఖ మంత్రులు హాజరుకానున్నారు. రెండు రోజుల పాటు 80 సెషన్లలో జరిగే ఈ సమావేశంలో… గ్లోబలైజేషన్, 2030 ఎజెండా, ప్రపంచ దేశాల్లో సాంకేతిక పాత్రతో పాటు పలు అంశాలపై లోతైన చర్చలు జరుగనున్నాయి.