నితిన్ ‘భీష్మ’ చిత్రం టీజర్ విడుదల

ల‌వ‌ర్ బోయ్ నితిన్ హీరోగా వెంకీ కుడుముల ద‌ర్శక‌త్వంలో వస్తున్న భీష్మ చిత్రం టీజర్ విడుదలైంది. రష్మిక మందన్న హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి విడుద‌లైన పోస్టర్స్ ప్రేక్షకుల‌లో ఆస‌క్తిని క‌లిగించాయి. తాజాగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్‌ ప్రేక్షకుల‌కి థ్రిల్ క‌లిగిస్తుంది. కూల్ అండ్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉన్న టీజ‌ర్ సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తుంది.