భారత న్యాయవ్యవస్థ నిజంగానే గుడ్డిది :నిర్భయ తల్లి

భారత న్యాయవ్యవస్థ నిజంగానే గుడ్డిదన్నారు నిర్భయ తల్లి ఆశాదేవీ. నిర్భయ కేసులో ఒకటి తర్వాత ఒక పిటీషన్లను దోషులు దాఖలు చేయడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. లాయర్లు దోషులను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాను ఏడేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నానని పేర్కొన్నారు. దోషులకు ఈనెల 22న ఉరిశిక్ష అమలవుతుందా లేదా అని నన్ను ప్రశ్నించే బదులు ప్రభుత్వాన్ని అడగాలని అన్నారు. కాగా మంగళవారం ముఖేష్ సింగ్ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటీషన్ పెట్టుకున్నాడు. క్షమాభిక్ష పిటీషన్ పై నిర్ణయానికి, ఉరిశిక్షకు మధ్య కనీసం 14 రోజుల వ్వవధి ఉండాలి. దీంతో దోషుల ఉరిశిక్ష ఆలస్యం అయ్యే అవకాశముంది.