కంగనా చెప్పింది కరెక్ట్‌ :నిర్భయ తల్లి

అత్యాచార కేసుల్లో దోషులను బహిరంగంగా ఉరి తీయాలంటూ కంగనా చేసిన వ్యాఖ్యలకు… బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు నిర్భయ తల్లి మద్దతు తెలిపారు. నిర్భయ దోషులను క్షమించాలంటూ న్యాయవాది ఇందిరాజైసింగ్‌ చేసిన వ్యాఖ్యలను విమర్శించిన.. కంగనాకు ఆశాదేవి కృతజ్ఞతలు చెప్పారు. దోషులకు అనుకూలంగా మాట్లాడే మహిళలు రాక్షసులకు జన్మనిస్తారంటూ కంగనా చేసిన వ్యాఖ్యలను ఆశాదేవి సమర్థించారు. ఆమె మాట్లాడిన దాంట్లో తప్పేమి లేదన్నారు. తన కూతురు పట్ల జరిగిన దారుణం వల్ల పడిన బాధ ఏంటో… తనకే తెలుసునని ఆమె అన్నారు. ఇంత దారుణమైన ఘటన జరిగినప్పుడు మానవహక్కుల కోసం పోరాడే వాళ్లు ఎటుపోయారని ప్రశ్నించారు. మానవ హక్కుల పేరుతో యువతుల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలను ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు.