ఆరోజే మాకు అసలైన పండగ :నిర్భయ తల్లి

తన బిడ్డను అతి దారుణంగా హింసించి హత్య చేసిన దుర్మార్గులను ఉరితీసే రోజే తమ జీవితంలో అసలైన పండగ రోజని నిర్భయ తల్లి ఆశా దేవి అన్నారు. జనవరి 22 తన జీవితంలో మరిచిపోలేనిదని తెలిపారు. నిర్భయపై అత్యాచారం, హత్య కేసులో దోషులైన వినయ్ కుమార్‌ శర్మ, ముఖేష్‌ సింగ్‌ పెట్టుకున్న క్యూరేటివ్‌ పిటిషన్లను సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా తోసిపుచ్చడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. గత 7 ఏళ్లుగా ఆమె చేసిన న్యాయపోరాటం ఫలించిందన్నారు. అయితే… నిర్భయ కేసులోని ఇద్దరు దోషులు వినయ్‌ కుమార్‌ శర్మ, ముఖేష్‌ సింగ్‌ తమ ఉరిశిక్షను మరోసారి పరిశీలించాలని వేసిన పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. దీంతో నలుగురు నిందితులను జనవరి 22న ఉదయం 7 గంటలకు తీహార్‌ జైల్లో ఉరి తీయనున్నారు. దీంతో, న్యాయం ఇంకా బతికే ఉన్నట్లు నిర్భయ తల్లి ఆశాదేవి తెలిపారు.