ఉత్కంఠ మలుపులు తిరుగుతున్న నిర్భయ కేసు…

నిర్భయ కేసు పలు మలుపులతో ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే దోషులకు ఈనెల 22న ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీ ట్రయల్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. అయితే ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ముఖేష్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే విచారించిన ఢిల్లీ హైకోర్టు..పిటీషన్ ను తిరస్కరించింది. దీంతో రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్నానని..రాష్ట్రపతి నిర్ణయం వెలువడే వరకు ఉరిశిక్ష నిలిపివేయాలని ముఖేష్ సింగ్ తరపు లాయర్ ఢిల్లీ ట్రయల్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. పిటీషన్ ను స్వీకరించిన కోర్టు రేపు(గురువారం) మధ్యాహ్నం 2 గంటలకు వాదనలు వింటామని తెలిపింది. దీనిపై ముఖేష్ సింగ్ తల్లిదండ్రుల అభిప్రాయాలు కూడా కోర్టు విననుంది.