జేఎన్‌యూ విద్యార్థులతో ఎన్‌హెచ్‌ఆర్సీ సమావేశం…!

జాతీయ మానవ హక్కుల కమిషన్.. ఢిల్లీ జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థులతో సమావేశమైంది. డిసెంబర్ 15న యూనివర్శిలో విద్యార్థులపై జరిగిన దాడి గురించి విచారణ చేపట్టారు. నలుగురు సభ్యుల కమిటీ.. విద్యార్థుల నుంచి మౌఖిక, రాతపూర్వకంగా సాక్ష్యాలను నమోదు చేశారు. కాగా, జేఎన్‌యూలో జరిగిన హింసాత్మక దాడులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.