మహోజ్వలంగా సాగుతున్న గ్రీన్ ఛాలెంజ్…

పచ్చదనాన్ని పెంచడం కోసం ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ మహోజ్వలంగా ముందుకు సాగుతోంది. అన్నివర్గాల జనాన్ని ఆకట్టుకుంటూ దిగ్విజయంగా కొనసాగుతోంది. కేంద్రమంత్రులు, పలురంగాల ప్రముఖులు మొదలుకొని సామాన్యజనం వరకు అన్ని వర్గాలు గ్రీన్ ఛాలెంజ్ లో భాగస్వాములవుతున్నారు. అందరూ ఎంపీ సంతోష్ కుమార్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

గ్రీన్ ఛాలెంజ్. పర్యారణ పరిరక్షణను చాటిచెబుతూ ఎంపీ సంతోష్ కుమార్ ఈ ఆకుపచ్చని యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. ఒక మొక్కతో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు కోట్లాది మొక్కలకు చేరింది. సమాజంలోని అన్నివర్గాలను గ్రీన్ ఛాలెంజ్ ఆలోచింపజేస్తోంది. అందుకే అన్నివర్గాల జనం హరితయజ్ఞంలో పాల్గొంటున్నారు. అందుకే ఈ మధ్య ఎవరిని కదిలించినా.. ఇదే మాట వినిపిస్తోంది. రాజకీయ వర్గాల్లో అయితే.. రోజూ ఎవరో ఒకరు గ్రీన్ చాలెంజ్ లో భాగమవుతూ టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ను ప్రశంసిస్తున్నారు. ఇదో అద్భుతమైన ఆలోచన అని అభినందిస్తున్నారు. ప్రకృతి పరిరక్షణ, పర్యావరణాన్ని కాపాడాలన్న ఆతృతతో ఆయన అవలంబిస్తున్న వైఖరిని అంతా అనుసరించాల్సిల అవసరం ఉందని కూడా స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకు ఒకరిద్దరు కాదు.. చిన్న స్థాయి ప్రముఖుల నుంచి.. పెద్ద స్థాయి నేతల వరకూ.. సామాజికంగా విభిన్న రంగాలకు చెందిన ప్రతినిధులు కూడా ఈ హరితయజ్ఞంలో భాగస్వాములయ్యారు. ఇంకా గ్రీన్ ఛాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతోంది. అంతెదుకు కేంద్రమంత్రులు మొదలుకొని గల్లీల్లో ఉండే సామాన్యజనం కూడా ఈ హరితయజ్ఞానికి సంపూర్ణ మద్దతు పలికారు.

మొక్కలు నాటడమే కాదు. మన చుట్టూ ఉన్న వారిని కూడా మొక్కలు నాటేలా ప్రోత్సహించడం గ్రీన్ ఛాలెంజ్ లక్ష్యం. అందుకే ఈ హరిత సవాల్ వినూత్నంగా కొనసాగుతోంది. ఒకరు మొక్క నాటిన తర్వాత.. మరో ముగ్గురిని నామినేట్ చేయాలి. వారిలో ఎవరైనా మొక్కను నాటితే.. వారు కూడా మరో కొత్త ముగ్గురిని నామినేట్ చేయాలి. ఇలా ఎంపీ సంతోష్ కుమార్ మొదలుపెట్టిన ఈ బృహత్ కార్యం.. దేశ వ్యాప్తంగా విస్తరించింది. ఒకరిని చూసి మరొకరు.. వారిని చూసి ఇంకొందరు.. ఆ కొందరిని చూసి మరి కొందరు… ఇలా.. పదులు వందలు దాటి వందలు వేలు దాటి కోట్లాది మొక్కలకు చేరింది గ్రీన్ ఛాలెంజ్. సామాన్యజనంతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా మేముసైతమంటూ ఈ హరితయజ్ఞంలో భాగస్వాములవుతున్నారు. మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణలో తమవంతు పాత్రను పోషిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ ను మనసారా అభినందిస్తున్నారు.

ఈ మధ్య ఎన్నో ఛాలెంజ్ లు వచ్చాయి. అందులో ఎంతోమంది సెలబ్రిటీలు పాల్గొన్నారు కానీ గ్రీన్ ఛాలెంజ్ మాత్రం కొంత భిన్నమైంది. అందుకే గ్రీన్ ఛాలెంజ్ కు బాలీవుడ్ కూడా ఫిదా అయిపోయింది. ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ అయితే.. ఈ మధ్య వచ్చిన చాలా రకాల చాలెంజ్ లలో గ్రీన్ ఛాలెంజ్ ది బెస్ట్ అని ప్రశంసించారు. కపిల్ శర్మ కామెడీ షోలో పాల్గొన్న ఆయన గ్రీన్ చాలెంజ్ ను చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ ను మనస్ఫూర్తిగా అభినందించారు. జాకీ ష్రాఫ్ తాను మాత్రమే పాల్గొనడం కాదు….. మరికొందరిని కూడా హరిత సవాల్ లో భాగస్వాములను చేశారు. మొక్కలు నాటాలంటూ నామినేట్ చేశారు. ఇప్పుడు గ్రీన్ చాలెంజ్ దేశం దాటి అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందిందని ప్రశంసించారు. గ్రీన్ చాలెంజ్ కు దేశవ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.

గ్రీన్ ఛాలెంజ్ కు అంకురార్పణ చేసింది ఎంపీ సంతోష్ కుమార్. ఆయన ఏనాడు గ్రీన్ ఛాలెంజ్ కోసం ప్రచారం చేయలేదు. పెద్ద పెద్ద ప్రకటనలివ్వలేదు. ఊరూరా చాటింపు కూడా వేయలేదు. పబ్లిసిటీ స్టంటూ చేయలేదు. అయినా కేవలం మౌత్ పబ్లిసిటీతో ఈ హరితయజ్ఞం విజయవంతంగా నడుస్తోంది. మామూలుగా అయితే నాయకులంటే చిన్నపనికే పెద్ద హడావుడి చేస్తారు. కటౌట్లు, ఫాంప్లేట్లు, హోర్డింగులతో బిల్డప్ ఇస్తారు. కానీ ఎంతో సంతోష్ కుమార్ మాత్రం ఎప్పుడూ ఈ బాటలో నడవలేదు. ఆయన ఎప్పుడూ గ్రీన్ ఛాలెంజ్ కోసం ప్రచారం చేసింది లేదు. తను మొదలుపెట్టిన ఈ యజ్ఞాన్ని ఎలా విజయవంతంగా కొనసాగించాలన్న విషయంపైనే ఆయన దృష్టి పెట్టారు. అందుకే.. ఆలోచనతో పాటు.. ఆచరణలోనూ ఆయన విజయవంతమై అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

సీఎం కేసీఆర్ హరితహారం లాంటి మంచి కార్యక్రమంతో తెలంగాణను ఆకుపచ్చని రాష్ట్రంగా మార్చేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇదే కాన్సెప్ట్ తో హరితహారానికి మద్దతుగా ఎంపీ సంతోష్ కుమార్ కూడా గ్రీన్ చాలెంజ్ ను దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇంకా ఈ హరితయజ్ఞంలో భాగస్వాములు కాని జనానికి విజ్ఞప్తి. రండి ఈ ఆకుపచ్చని క్రతువు కోసం మీరు ముందుకు రండి. తెలంగాణను ఆకుపచ్చ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో మీరు కూడా భాగస్వాములు కావాలి. తెలంగాణ ఆకుపచ్చని వనంగా మారే క్రతువులో పాల్గొనాలి. గ్రీన్ ఛాలెంజ్ కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలి.