హైదరాబాద్‌లో అదృశ్యం, పూణెలో ఆచూకీ లభ్యం..!

హైదరాబాద్‌లో అదృశ్యమైన సాఫ్టవేర్ ఉద్యోగిని ఆచూకీ లభ్యమైంది. గత నెల 26న అదృశ్యమైన యాపిల్ ఉద్యోగిని రోహిత మహారాష్ట్రలోని పూణెలో ఉన్నట్టు గచ్చిబౌలి పోలీసులు గుర్తించారు. అయితే.. కుటుంబ కలహాల నేపథ్యంలో 2019 డిసెంబర్ 26న రోహిత్ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. రోహిత కనిపించకుండా పోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు… దర్యాప్తు చేపట్టారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు… మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా రోహిత పూణెలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడి పోలీసుల సహాయంతో రోహితను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇవాళ(బుధవారం) సాయంత్రానికి ఆమెను హైదరాబాద్‌కు తీసుకొచ్చి, కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది.