తెలంగాణ భవన్‌లో ఘనంగా సంక్రాంతి సంబురాలు…

తెలంగాణ భవన్‌లో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరిగాయి. సంబురాల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పాల్గొని… తెలంగాణ భవన్‌పై పతంగులు ఎగురవేశారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ పరిసరాలను రంగురంగుల ముగ్గులతో ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు, హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, రైతు సమన్వయ సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, ఎమ్మెల్సీలు.. శ్రీనివాస్‌ రెడ్డి, నవీన్‌రావు, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, సివిల్‌ సైప్లె కార్పోరేషన్‌ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.