ఈ ఫలితం నా బాధ్యతను మరింత పెంచింది :మంత్రి కేటీఆర్

సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని ప్రజలు మరోసారి బలపరిచారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నుంచి ప్రతీ ఎన్నికల్లో గెలుస్తూనే వచ్చామని గుర్తుచేశారు. ఈ సందర్భంగా… మున్సిపల్ ఎన్నికల్లో ఆదరించి, భారీ విజయాన్ని అందించిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. 2014 నుంచి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్లే ఈ విజయం సాధ్యమైందని అన్నారు. ఈ భారీ విజయం మున్సిపల్‌ మంత్రిగా తన బాధ్యతను మరింత పెంచాయని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం కోసం కృషి చేసిన ప్రతీ కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. 100కు పైగా మున్సిపాలిటీల్లో విజయం సాధించడం గొప్ప విషయం అని కేటీఆర్‌ పేర్కొన్నారు.