వారికి పౌరసత్వం కట్టబెట్టే కుట్రే.. సీఏఏ :మమతా బెనర్జీ

బీజేపీపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాషాయ పార్టీకి నిధులు సమకూర్చిన విదేశీయులకు పౌరసత్వం కట్టబట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సీఏఏను అందుకోసమే రూపొందించారని మమతా బెనర్జీ ఆరోపించారు. సీఏఏకు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ ఛత్ర పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో మమత పాల్గొన్నారు. విదేశాల నుంచి పార్టీకి నిధులు తీసుకొచ్చిన వారికి, నల్ల ధనాన్ని తెలుపుగా మార్చే వారికి పౌరసత్వం ఇస్తున్నారంటూ ఆమె ఆరోపించారు.