కుంభకోణం రేప్ కేసులో నలుగురికి జీవితశిక్ష…

తమిళనాడులో 27 ఏళ్ల మహిళను అత్యాచారం చేసిన కేసులో నలుగురు దోషులకు జీవితకాల జైలుశిక్ష పడింది. ఈ మేరకు దోషులు పురుషోత్తం, అన్బరసన్, దినేశ్, వసంత్లకు తాంజావూర్ మహిళా కోర్టు యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 2018 డిసెంబర్ ఒకటవ తేదీన కుంభకోణంలో అత్యాచార ఘటన జరిగింది. ఉద్యోగంలో భాగంగా బ్యాంకు శిక్షణా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఓ మహిళను నలుగురు రేప్ చేశారు. రైల్వే స్టేషన్లో దిగిన మహిళను ఇద్దరు తొలుత ఆటోరిక్షాలో తీసుకువెళ్లారు. ఆ తర్వాత మరో ఇద్దరు వచ్చి ఆమెను రేప్ చేశారు. ఈ ఘటనపై విచారణ కొనసాగించిన కోర్టు తుదితీర్పు వెళ్లడించింది.