సీఏఏపై సుప్రీంలో కేరళ సర్కార్‌ పిటిషన్…

పౌరసత్వ సవరణ చట్టంపై కేరళ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఏఏకు వ్యతిరేకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. రాజ్యాంగంలోని 14, 21, 24 అధికారణలకు ఈ చట్టం తీవ్ర విఘాతం కలిగిస్తోందని సుప్రీం దృష్టికి తీసుకెళ్లింది. దేశ లౌకికత్వాన్ని దెబ్బతీసే విధంగా చట్టం ఉందంటూ పిటిషన్‌ లో పేర్కొంది. సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంను ఆశ్రయించిన తొలి రాష్ట్ర ప్రభుత్వంగా కేరళ నిలిచింది. ఇప్పటికే కేరళ అసెంబ్లీలో పార్టీలకతీతంగా సీఏఏని వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఇక ఇదే విషయంపై బీజేపీయేతర ముఖ్యమంత్రులకు విజయన్ లేఖ రాశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు వివాదాస్పద చట్టాలను వ్యతిరేకించాలని కోరారు.