కరీంనగర్‌ కార్పొరేషన్‌: పోస్టల్‌ బ్యాలెట్స్‌లో టీఆర్ఎస్‌ ఆధిక్యం

కరీంనగర్‌ మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యంతో కొనసాగుతోంది. మొదటగా చేపట్టిన పోస్టల్ బ్యాలెట్స్‌ లెక్కింపులో టీఆర్ఎస్‌ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతుంది. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 501 పోస్టల్ బ్యాలెట్స్‌ ఓట్లు పోల్ అవగా.. వాటిలో టీఆర్ఎస్‌కు 207 ఓట్లు, బీజేపీకి 126, కాంగ్రెస్‌కు 9, ఇతరులకు 90 ఓట్లు వచ్చాయి. అటు.. కరీంనగర్‌ కార్పొరేషన్ పరిధిలోని 58 డివిజన్లకు సంబంధించిన బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కాగా.. కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. వాటిలో 20వ, 37వ డివిజన్లలో టీఆర్ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవం కావడంతో.. మిగతా 58 డివిజన్లకు ఈ నెల 24న పోలింగ్ జరిగింది.