సైనా-గోపీచంద్ వివాదం: గుత్తా జ్వాల ఘాటు వ్యాఖ్యలు

బ్యాడ్మింటన్‌ కోచ్‌ గోపీచంద్‌, షట్లర్‌ సైనా నెహ్వాల్‌ వివాదంపై గుత్తా జ్వాల ఘాటుగా స్పందించారు. 1999 నేషనల్ అకాడమీలో ఏం జరిగిందో తనకు తెలుసని మరిన్ని సందేహాలు రేకెత్తించారు. ప్రస్తుతం తప్పు జరిగిందని మొసలి కన్నీరు కారుస్తున్న వ్యక్తి.. హైదరాబాద్‌ను వదలి ప్రకాశ్‌ పదుకొణె అకాడమీలో ఎందుకు చేరారరంటూ సైనాపై పరోక్ష విమర్శలు గుప్పించారు. తన బయోగ్రఫీలోని బిట్టర్‌ రైవల్‌రీ అధ్యాయంలో సైనా తన అకాడమీ వీడడం బాధాకరమని గోపీ తెలిపాడు. భారత బ్యాడ్మింటన్‌ దిగ్గజం ప్రకాశ్‌ పదుకొణె తన గురించి ఆమెకు సానుకూలంగా చెప్పలేదని ఆరోపించారు. అటు గోపీచంద్‌ వ్యాఖ్యలపై ప్రకాశ్‌ పదుకొణె బ్యాడ్మింటన్‌ అకాడమీ వివరణ ఇచ్చింది. హైదరాబాద్‌ను వీడాలన్న సైనా నిర్ణయం వ్యక్తిగతమని వెల్లడించింది. ఆమె నిర్ణయంలో తమ జోక్యం లేదని స్పష్టం చేసింది. ఈ వార్తను గుత్తా జ్వాల ట్వీట్‌ చేశారు.