కొందరు ప్రొఫెసర్లు విద్యార్థులను నాపైకి ఉసిగొల్పుతున్నారు :వీసీ

జేఎన్‌యూ వైస్ ఛాన్సలర్ జగదీశ్ కుమార్… యూనివర్సిటీ ప్రొఫెసర్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. కొందరు ప్రొఫెసర్లు తనపై విద్యార్థులను ఉసిగొలుపుతున్నారని మండిపడ్డారు. సదరు ప్రొఫెసర్లను సోషల్ మీడియాలో గుర్తించవచ్చునని చెప్పారు. యూనివర్సిటీ మూసివేయాలని లేదా వేరొక ప్రదేశానికి తరలించాలని జేఎన్‌యూ యాజమాన్యం హెచ్ఆర్డీ శాఖకు ఇవ్వలేదని చెప్పారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘాల ప్రతినిథులు తన రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారన్న ఆయన.. తన రాజీనామా గురించి హెచ్ఆర్డీ మంత్రిత్వశాఖను అడగాలని సూచించారు. జేఎన్‌యూను మూసివేసేది లేదన్న ఆయన.. రాబోయే ఐదేళ్ళలో అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకమైన గుర్తింపు పొందుతుందని తెలిపారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలని సూచించారు. కొందరు విద్యార్థుల వలలో చిక్కవద్దని వీసీ హెచ్చరించారు.