భారత్‌లో దాడులకు ఐసిస్ కుట్ర!

కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐసిస్ భారత్‌లో దాడులకు కుట్ర చేస్తున్నట్లు ఇంటిలిజెన్స్‌ బ్యూరో వెల్లడించింది. ఢిల్లీ, గుజరాత్‌లలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడచ్చని తెలిపింది. ఇప్పటికే నేపాల్‌ నుంచి ఆరుగురు ఉగ్రవాదులు భారత్‌లో చొరబడ్డారని తెలిపింది. ఈ నెల 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలే లక్ష్యంగా దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ తెలిపింది. దీంతో ఇరు రాష్ర్టాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాలపై పోలీసులు నిఘా ఉంచాలని సూచించింది. ప్రజల్ని అప్రమత్తం చేయాలని వెల్లడించింది.