భారత్‌ ఉద్రిక్తతలను తగ్గించగలదు :ఇరాన్ మంత్రి

భారత పర్యటనలో ఉన్న ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావద్‌ జరీఫ్‌ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. అమెరికా దాడులు, ఇరాన్‌ ప్రతిదాడులు.. ప్రస్తుతం తమ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులను ప్రధానికి వివరించారు. అటు మిడిల్ ఈస్ట్‌ లో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించడంలో భారత్‌ కీలక పాత్ర పోషించగలదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరాన్‌, యూఏఈ, ఒమన్‌, ఖతర్‌ సహా పలు మధ్యప్రాచ్య దేశాలతో భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. తమ దేశానికి దౌత్యం పట్ల ఆసక్తి ఉందని.. కానీ, అమెరికాతో చర్చలు జరపడంపై తమకు ఆసక్తి లేదని చెప్పారు. .

సులేమానీ హత్య విషమంలో అమెరికా దూకుడుగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిందని జావద్ జరీఫ్ అన్నారు. యూఎస్‌తో అణు ఒప్పందం కలిగి ఉన్నామన్న ఆయన.. అమెరికానే తన కట్టుబాట్లను కొనసాగించకుండా దాన్ని నాశనం చేసిందని మండిపడ్డారు. ప్రస్తుత ఉద్రిక్తతల కారణంగా ఇరాన్ బిలియన్‌ డాలర్ల నష్టాన్ని చవిచూసిందని తెలిపారు. అటు, ఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తోనూ జావద్‌ సమావేశమయ్యారు.