టీ20 వరల్డ్ కప్‌: భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

ఈ ఏడాది 20-ట్వంటీ వరల్డ్ కప్ లో పాల్గొననున్న భారత మహిళ క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. 2020 టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు ఆస్ట్రేలియాలో జరగనుంది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు 15 మంది సభ్యులను బీసీసీఐ ఎంపిక చేసింది. భారత మహిళల జట్టుకు హర్మన్‌ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా వ్యవహరించనుంది. ఇక ఓపెనింగ్ బ్యాట్స్ వుమెన్ స్మృతి మందన వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ టీంలో బెంగాల్‌కు చెందిన రిచా ఘోష్‌కు కొత్తగా అవకాశం కల్పించారు. రీచా ఇటీవల జరిగిన మహిళల ఛాలెంజర్ ట్రోఫీలో భాగంగా.. ఒకే మ్యాచ్‌లో 26 బంతుల్లో 36 పరుగులు చేసి నాలుగు బౌండరీలు మరియు ఒక సిక్సర్ సాధించింది.

కాగా… ఫిబ్రవరి 21న సిడ్నీ షోగ్రౌండ్ స్టేడియంలో జరిగే టోర్నిమెంట్ ప్రారంభ మ్యాచ్‌లోడిపెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో… భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న వరల్డ్ కప్‌లో.. గ్రూప్‌ `ఏ`లో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా,న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. గ్రూప్‌ `బి`లో ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రిక, వెస్టిండీస్‌, పాకిస్థాన్, థాయిలాండ్ ఉన్నాయి. ఇక… టీ20 వరల్డ్ కప్‌కు ముందు ఆస్ట్రేలియా వేదికగా జరిగే ట్రై-సిరీస్‌ కోసం కూడా టీమ్‌ను ప్రకటించింది బీసీసీఐ. జనవరి 31నుంచి ప్రారంభం కానున్న ట్రై సిరీస్‌ కోసం… 16 మందితో టీమ్‌ను సెలెక్ట్ చేశారు. ఈ ట్రై-సిరీస్ లో ఇంగ్లాండ్ పాల్గొననుంది.

ప్రపంచ కప్ టీ20 (15 మంది సభ్యులు) టీమ్: హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మందాన్న(వైస్-కెప్టెన్), షఫాలి వర్మ, జెమిమా రోడ్రిక్స్, దీప్తి శర్మ, హర్లీన్ డియోల్, వేద కృష్ణమూర్తి, రిచా ఘోష్, తనియా భాటియా(కీపర్), పూనమ్ యాదవ్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే, అరుంధతి రెడ్డి, పూజా వస్త్రాకర్.

ట్రై-సిరీస్ (16 మంది సభ్యులు) టీమ్: హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మందాన్న(వైస్-కెప్టెన్), షఫాలి వర్మ, జెమిమా రోడ్రిక్స్, దీప్తి శర్మ, హర్లీన్ డియోల్, వేద కృష్ణమూర్తి, రిచా ఘోష్, తనియా భాటియా(కీపర్), పూనమ్ యాదవ్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే, అరుంధతి రెడ్డి, పూజా వస్త్రాకర్, నుజత్ పర్వీన్.