సోషల్ మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

జేఎన్‌యూ దాడికి సంబంధించి వాట్సాప్, ఫేస్బుక్, గూగుల్, యాపిల్ సంస్థలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జేఎన్‌యూ ఘటనకు సంబంధించిన వీడియోలను, వాటిపై జరిగిన చర్చకు సంబంధించిన సందేశాలను భద్రపరచాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. జేఎన్‌యూ ప్రొఫెసర్ అమీత్ సరమేశ్వరన్, అతుల్ సూద్, శుక్లా వినాయక్ సావంత్ ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులు తమ స్పందనను తెలియజేయాల్సిందిగా కోరింది. దీనిపై స్పందించిన ఢిల్లీ పోలీసులు తాము ఇప్పటికే దాడి ఘటనకు సంబంధించిన వీడియోలను భద్రత పరచాల్సిందిగా విశ్వవిద్యాలయానికి లేఖ రాసినట్లు న్యాయస్థానానికి తెలియజేశారు.